‘కరోనా’పై సీఎం జగన్‌ అత్యున్నత స్థాయి సమావేశం

అమరావతి : కరోనావైరస్ (కోవిడ్‌-19)నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య శాఖ అధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరాలు వెల్లడించనున్నారు.