విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మందుల కొనుగోలులో చేతివాటం, పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగినట్లు సమాచారం అందడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏసీబీ మెరుపుదాడులు నిర్వహించింది. కగా వారం కిందట ఏపీలోని ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం జరిగినట్లు వెలుగు చూడడంతో ఏసీబీ దాడులు ప్రాధాన్యతను సంతరించకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రులపై దృష్టి సారించిన ఏసీబీ 13 టీమ్‌లుగా ఏర్పడి వంద మంది సిబ్బందితో సోదాలు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వాసుపత్రులపై ఏసీబీ మెరుపు దాడులు