బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో నవాజుద్దీన్‌ సోదరి మృతి

బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో నవాజుద్దీన్‌ సోదరి మృతి


ముంబై: బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ సోదరి స్యామా తామ్షీ సిద్ధిఖీ(26) మృతి చెందారు. గత కొద్ది కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె శనివారం మరణించినట్లు సిద్ధిఖీ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా పద్దెమినిదేళ్ల వయస్సులోనే స్యామా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారిన పడిన విషయాన్ని నవాజుద్దీన్ గతేడాది సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. స్యామా 25వ పుట్టినరోజు సందర్భంగా... చిన్న వయస్సు నుంచే తన చిట్టి చెల్లెలు చావుతో ధైర్యంగా పోరాడుతోందని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా దాదాపు ఏడేళ్లుగా స్యామాకు చికిత్స చేస్తున్న డాక్టర్లకు కృతఙ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఆమె మరణంతో నవాజుద్దీన్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.